Breaking News

స్వదేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.! పాకిస్థాన్ కొత్త చట్టం..

Published on Tue, 06/27/2023 - 19:27

పాక్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ మళ్లీ తన సొంత దేశానికి రావడానికి మార్గం సుగమం అయింది! చట్టసభ్యుల అనర్హతపై కాలపరిమితిని నిర్ణయిస్తూ పాక్ కేంద్ర అసెంబ్లీ చట్టం తీసుకువచ్చింది. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ పార్టీ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ మేరకు చట్టం తీసుకురావడం గమనార్హం. 

చట్ట సభ‍్యులపై ఐదేళ్లకు మించి అనర్హత వేటు వేయడానికి అవకాశం లేనివిధంగా చట్టాన్ని సవరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ సవరణపై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధికీ సంజ్‌రాణి సంతకం కూడా చేసి ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అయితే.. హజ్‌ యాత్రలో ఉన్న అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ లేని సమయంలో ఈ చట్టం తీసుకురావడం గమనార్హం.

ఇదీ చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..

బ్రిటన్‌లో నవాజ్‌ షరీఫ్‌..
అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే.. 2019లో ఆరోగ్య రీత్యా బెయిల్‌పై విడుదలయిన నవాజ్ షరీఫ్.. బ్రిటన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పాక్ రాజకీయాలను బ్రిటన్ నుంచే తెరవెనక ఉండి శాసిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు. 

మళ్లీ రాజకీయాల్లోకి..
గతేడాది విశ్వాస పరీక్షలో ఓడి ఇమ్రాన్‌ ఖాన్ పదవీత్యుడయ్యాక.. నవాజ్ షరీఫ్ సోదరుడు సెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, తన సోదరున్ని స్వదేశానికి తీసుకురావాలని సెహబాజ్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని అధికార PML-N పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ రాజకీయంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇదీ చదవండి: నవాజ్‌ పాక్‌ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్‌ షరీఫ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)