Breaking News

భారత యుద్ధ విమానాలు కూల్చేశాం.. పాక్‌ అధికారి ఓవరాక్షన్‌

Published on Wed, 12/03/2025 - 07:02

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌పై పెద్ద ఎత్తున దాడుల చేశామని, భారత్‌కు చెందిన యుద్ధ విమానాలు కూల్చివేశామని పాకిస్తాన్‌ చీఫ్‌ ఆఫ్‌ ద ఎయిర్‌ స్టాఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సింధూ మంగళవారం ప్రకటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా, ఈ ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించింది. పాక్‌ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలపై వైమానిక దాడుల చేసింది. అయితే, భారత దాడులను గట్టిగా తిప్పికొట్టామని జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సింధూ పేర్కొన్నారు.

భారత వైమానిక దళానికి చెందిన ఆధునిక ఫైటర్‌ జెట్లను, ఎస్‌–400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని చెప్పారు. ఇందులో రఫేల్, ఎస్‌–30ఎంకేఐ, మిరేజ్‌–2000, మిగ్‌–29 లాంటి ఫైటర్‌ జెట్లు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా భారత వైమానిక స్థావరాలను, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ధ్వంసం చేశామని వివరించారు. కానీ, ఆయన అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడం గమనార్హం. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌కు చెందిన 12న యుద్ధ విమానాలను కూల్చివేశామని భారత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ఇటీవల వెల్లడించారు.   

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)