Breaking News

'దీన్ని అలా చూడకూడదు..': భారత్‌ పర్యటనపై పాక్‌ మంత్రి వ్యాఖ్యలు

Published on Fri, 04/21/2023 - 15:21

భారత్‌లోని గోవాలో వచ్చే నెల మే 4 నుంచి 5 వరకు షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ కౌన్సిల్‌(ఎస్సీఓ) సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి బిలావల్‌ భుట్టో జర్దారీ పాక్‌ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ మేరకు జర్దారీ పాక్‌ స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే నెలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో తాను పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు.

తాము ఎస్సీఓ చార్టర్‌కు కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. తాను ఈ సమావేశంలో పాలుపంచుకోవడం అనేది SCO చార్టర్‌ పట్ల పాక్‌కు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడకూడదని జర్దారీ అన్నారు. కాగా, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో పర్యటించనున్న తొలి విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో. చివరిసారిగా 2011లో అప్పటి పాక్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ భారత్‌లో పర్యటించారు. భారత్‌లో జరగనున్న విదేశాంగ మత్రుల సమావేశానికి పాక్‌, చైనాతో సహా షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యులందరికీ భారత్‌ అధికారికంగా ఆహ్వానాలు పంపింది.

ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గ్యాంగ్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతేడాది సెప్టంబర్‌లో తొమ్మిది మంది సభ్యులతో కూడిన మెగా గ్రూపింగ్‌కు భారతదేశం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఈ ఏడాది కీలక మంత్రి వర్గ సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనుంది. ఈ 20  ఏళ్ల షాంఘై సహకార సంస్థలో రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్‌, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

ఇందులో ఇరాన్‌ ఇటీవలే తాజగా సభ్యత్వం పొందిన దేశం. పైగా తొలిసారిగా ఇరాన్‌ బారత్‌ సారథ్యంలో పూర్తిస్థాయి సభ్యునిగా గ్రూపింగ్‌ సమావేశానికి హాజరవుతోంది. ఇక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్‌ 2022లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగింది.  దీనికి నరేంద్ర మోదీ హజరయ్యారు. అంతేగాదు జూన్‌ 2019 కిర్గిజిస్థాన్‌లో షాంఘై సదస్సు తదనంతరం జరిగి తొలి వ్యక్తిగత శిఖరాగ్ర సదస్సు కూడా ఇదే. 

(చదవండి:  ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)