Breaking News

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పెను విపత్తులో పాక్‌?

Published on Thu, 03/05/2026 - 07:03

న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్‌ను సైతం చుట్టుముట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన ఆత్మాహుతి డ్రోన్ సౌదీ అరేబియాపై దాడి చేసిన దరిమిలా పాకిస్తాన్‌ ఈ యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025 సెప్టెంబరులో సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ల మధ్య కుదిరిన ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్’ (SMDA) ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా, అది ఇద్దరిపై జరిగిన దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ గనుక సౌదీపై దాడులను ఉధృతం చేస్తే, ఆ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. 

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. తమ మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని, సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరాన్ విదేశాంగ మంత్రిని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ బహిరంగంగానే తన రక్షణ ఒప్పందాన్ని ప్రస్తావించింది. అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్, సంపన్న దేశమైన సౌదీకి అణు రక్షణ కల్పించేలా ఈ ఒప్పందం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందాలకు (ఎన్‌పీటీ) ఇది విరుద్ధమని ఐక్యరాజ్యసమితి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

2025లో ఇజ్రాయెల్.. దోహా, ఖతార్‌లపై వైమానిక దాడులు చేసిన సమయం నుండి గల్ఫ్ దేశాల్లో అభద్రతా భావం పెరిగింది. అమెరికా తమను కాపాడుతుందన్న నమ్మకం సన్నగిల్లడంతోనే సౌదీ అరేబియా ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్‌తో ఈ రక్షణ ఒప్పందం చేసుకుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్ తన బలగాలను యుద్ధ భూమికి పంపకపోయినప్పటికీ, సౌదీకి మద్దతుగా దౌత్యపరమైన, వ్యూహాత్మకమైన బలాన్ని చేకూర్చడం ఖాయమనే విధంగా కనిపిస్తోంది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)