Breaking News

టైటాన్ విషాదం: వాళ్ళ చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు   

Published on Mon, 06/26/2023 - 19:01

యూఎస్: ఇటీవల అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తూ అటునుంచటే అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఐదుగురు. వారిలో పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు కూడా ఉన్నారు. దావూద్‌ తన కుమారుడితో చివరిగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆయన భార్య క్రిస్టీన్ దావూద్. 

గంటలు గడిచే కొద్దీ.. 
పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్ దావూద్ సముద్ర గర్భంలోకి సాహసయాత్రకు వెళ్లగా వారు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తారని పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామికి అనుబంధ పడవ) పైన క్రిస్టీన్ కూతురితో  ఎదురుచూస్తూ ఉన్నారు. టైటాన్ జలాంతర్గామి తప్పిపోయిందనగానే ఏమాత్రం భయపడని ఆమె గతంలో కూడా ఒకసారి తన భర్త విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారని తాను ధైర్యం కూడదీసుకుని అందరికీ ధైర్యం చెప్పారు. కానీ ఎప్పుడైతే 96 గంటలు గడిచాయో అప్పుడే ఆశలు వదులుకున్నట్లు ఆమె తెలిపారు. 

అమ్మా గిన్నిస్ రికార్డు సాధిస్తా..  
ఈ సందర్బంగా చివరిగా తన భర్త, కుమారుడితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ.. టైటానిక్ శకలాలను చూడటానికి వెళ్తున్నానని సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తనతో పాటు రూబిక్ క్యూబ్ ని తీసుకుని వెళ్లి సముద్రగర్భంలో రూబిక్ క్యూబ్ అమర్చిన మొట్టమొదటిగా వ్యక్తిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని సంబరపడ్డాడని, అందుకోసం దరఖాస్తు కూడా చేశాడని తెలిపారు. ఆ సన్నివేశాన్ని రికార్డ్ చేయాలని తన భర్త తనతోపాటు కెమెరాని కూడా తీసుకు  వెళ్లినట్లు చెప్పారు. 

చివరికి.. 
వారు వెళ్లి 96 గంటలు గడిచాయని చెప్పగానే నాకు కీడు శంకించింది, విపత్తును గ్రహించాను. కానీ నా కూతురు మాత్రం వాళ్ళు తిరిగి వస్తారని నమ్మకంతోనే ఉంది. తీర రక్షక దళాలు జలాంతర్గామి శకలాలు కనిపించాయని చెప్పాక గాని తను నమ్మలేదని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు.    

ఇది కూడా చదవండి: ఒక్కరి కోసం రెండు విమానాలు.. అదే వెరైటీ.. 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)