Breaking News

బలూచిస్తాన్‌: ఐడీ కార్డు చూసి ప్రయాణికుల్ని కాల్చేశారు!

Published on Fri, 07/11/2025 - 10:12

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. బస్సుల్లో వెళ్తున్న కొందరిని తుపాకులతో వచ్చిన దుండగులు అపహరించారు. ఆపై సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు.

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు బస్సుల నుంచి ప్రయాణికులను తుపాకులు చూపించి బెదిరించి ఎత్తుకెళ్లారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు పరిశీలించి కాల్చి చంపారు. శరీరం నిండా తుట్లతో 9 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారి ఒకరు ప్రకటించారు. ఘటనకు కారకులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్‌ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. దుండగుల కోసం భద్రతాల బలగాలు రంగంలోకి దిగాయి.

ఇదిలా ఉంటే.. బలూచ్‌ వేర్పాటువాద మిలిటెంట్‌ గ్రూపులు గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాయి. ఇందులో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(BLA) అత్యంత బలమైంది. అఫ్గనిస్తాన్‌-ఇరాన్‌ సరిహద్దుల గుండా ఇది స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే పాక్‌ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. 

బలూచిస్తాన్‌ అత్యంత అరుదైన ఖనిజాలకు మూలం. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ వనరులను పంజాబ్‌ ప్రావిన్స్‌కు దోచిపెడుతోందని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌ ప్రావిన్స్‌ నుంచి వాహనాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ వస్తోంది.

గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్‌లో వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ గురైంది. బొలాన్ జిల్లాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్‌ చేసింది. అందులో 30 మందిని కాల్చి చంపింది. మరో 215 మందిని బందీలుగా తీసుకుంది. బందీలలో ఎక్కువ మంది సైనికులు, పోలీసు, ISI, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సభ్యులుగా ఉండడం గమనార్హం. పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి.. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాడులు జరిపింది. అంతకు ముందు.. 2024 ఆగస్టులో ముసాఖేల్ జిల్లాలో 23 మంది ప్రయాణికులను ఐడెంటిటీ కార్డులు అడిగి కాల్చి చంపింది బీఎల్‌ఏ.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)