Breaking News

రష్యాను కట్టడి చేయండి.. మూడు రోజుల్లో 900లకు పైగా డ్రోన్ల దాడి: జెలెన్‌ స్కీ

Published on Tue, 05/27/2025 - 08:57

క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల్లో 900లకు పైగా రష్యా డ్రోన్ల దాడి జరిగినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అన్నారు. తమ దేశంపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించిన జెలెన్ స్కీ.. ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరిపినా దాడులు ఆగడం లేదంటూ మండిపడ్డారు. రష్యాను కట్టడి చేయాలని.. అమెరికా, యూరప్‌లు కఠిన ఆంక్షలు విధించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా, ఉక్రెయిన్‌పై శనివారం రాత్రి నుంచి మొదలుకుని సోమవారం ఉదయం దాకా రష్యా భారీ వైమానికి దాడులకు పాల్పడింది. యుద్ధం మొదలైన ఈ మూడేళ్లలో అతి పెద్ద వైమానిక దాడులు ఇవే! ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇష్టమొచ్చినట్టు మనుషులను చంపుకుంటూ పోతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఉక్రెయిన్‌ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని పుతిన్‌ చూస్తే అది అంతిమంగా రష్యా పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపైనా ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ఆయన తన దేశానికి మేలు చేసేలా మాట్లాడటం లేదు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటా సమస్యలను సృష్టిస్తోంది. నాకది నచ్చడం లేదు. జెలెన్‌స్కీ మాట్లాడకపోవడమే మంచిది’’అని తన ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు.
 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)