Breaking News

యూనస్‌ ప్రభుత్వంలోని వారే హాదీని చంపారు

Published on Fri, 12/26/2025 - 06:38

ఢాకా: బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన అతివాద విద్యార్థి నేత షరీఫ్‌ ఒస్మార్‌ హదీ సోదరుడు మహ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనస్‌ ప్రభుత్వంలోని ఒక వర్గం దేశంలో ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించేందుకు కుట్ర పన్నిందని, అందులో భాగంగానే హాదీని చంపించిందని ఆరోపించారు. 

హాదీ సోదరుడు ఒమర్‌ హాదీ ఇంక్విలాబ్‌ మంచ్‌ సారథ్యంలో జరిగిన ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ.. ‘హాదీ మృతికి మీరే కారణం. ఇదే సాకుతో సాధారణ ఎన్నికలను భగ్నం చేసేందుకు ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఒస్మాన్‌ హాదీ హత్య ఘటనపై బాధ్యత నుంచి తప్పించుకోలేరు’అంటూ ఆపద్ధర్మ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపా రు. హాదీ హత్యకు జరిగిన కుట్రను, కారకులను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

 ‘లేకుంటే దేశం నుంచి మిమ్మల్ని కూడా గెంటివేయక తప్పదు’అంటూ హెచ్చరించారు. గతేడాది షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలేందుకు హాదీ సారథ్యంలో జరిగిన ఇంక్విలాబ్‌ మంచ్‌ ఆందోళనలే కారణం. కాగా, ఒమర్‌ హాదీ ఆరోపణల నేపథ్యంలో హోం శాఖకు సంబంధించి యూనస్‌కు ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తున్న మహ్మద్‌ ఖుదా బక్ష్  చౌదరి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు బుధవారం రాత్రి ఆమోదించారు. 

వారి ఆచూకీ తెలిపితే బహుమానం
చిట్టోగ్రామ్‌లోని రావ్‌జాన్‌ ఏరియాలో మంగళవారం రాత్రి ఓ హిందువు ఇంటికి నిప్పంటించిన దుండగులు ఆచూకీ తెలిపిన వారికి బహుమానం అందజేస్తామని చిట్టోగ్రామ్‌ రేంజ్‌ పోలీస్‌ చీఫ్‌ అహ్సాన్‌ హబీబ్‌ ప్రకటించారు. ఖతార్‌లో ఉండే సుఖ్‌ షిల్, అనిల్‌ షిల్‌ల ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. 

దుండగులు బయటి నుంచి తలుపులకు తాళాలు వేయడంతో లోపలున్న రెండు కుటుంబాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది పైకప్పును తొలగించుకుని, ఎలాగోలా సురక్షితంగా బయటపడ్డారు. ఇదే ప్రాంతంలోని పలు హిందువుల ఇళ్లపై దుండగులు దాడులకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో గత ఐదు రోజుల వ్యవధిలో హిందువులకు చెందిన ఏడిళ్లకు నిప్పుపెట్టారని మీడియా తెలిపింది. ఈ ఘటనలకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్‌ చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)