Breaking News

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి?

Published on Tue, 02/24/2026 - 11:58

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారంటూ సాగుతున్న ప్రచారం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌కు చెందిన ప్రముఖ ప్రతిపక్ష సాయుధ ముఠా ‘పీపుల్స్ ముజాహిదీన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్’ (ఎంఈకే) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. సోమవారం నాడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఖమేనీ నివాస సముదాయం ‘మొతాహరి కాంప్లెక్స్’పై తమ సభ్యులు సాయుధ దాడికి పాల్పడ్డారని ఆ సంస్థ వెల్లడించింది.

సుమారు 100 మంది ఫైటర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని, ఈ భీకర పోరులో ఇరాన్ ప్రభుత్వ బలగాలకు భారీ ప్రాణనష్టం వాటిల్లడంతో పాటు, తమ వైపు కూడా ప్రాణనష్టం సంభవించిందని ఎంఈఎక్స్‌ పేర్కొంది. మరోవైపు ఈ దాడి జరిగినట్లు చెబుతున్న సమయంలో మొతాహరి కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా అంబులెన్సులు మోహరించాయని, భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ వెబ్‌సైట్లు సైబర్ దాడికి గురై, ఖమేనీకి వ్యతిరేకంగా సందేశాలు ప్రసారమయ్యాయనే ప్రచారం జరుగుతోంది.
 

అయితే ఈ వాదనలపై అటు ఇరాన్ అధికారిక మీడియా గానీ, ఇటు అంతర్జాతీయ స్వతంత్ర సంస్థలు గానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఖమేనీ ఆరోగ్య పరిస్థితి, మృతిపై వస్తున్న వార్తలను ధ్రువీకరించే ఆధారాలేవీ లభ్యం కాకపోవడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ అధికార యంత్రాంగంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న ఎంఈకే చరిత్రను పరిశీలిస్తే గతంలోనూ ఇలాంటి సంచలన ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
 

1965లో స్థాపితమైన ఈ సంస్థ 1979 విప్లవంలో పాల్గొన్నప్పటికీ, తదనంతరం ప్రస్తుత నాయకత్వంతో విభేదించి, ప్రవాసంలో ఉంటూ పోరాటం కొనసాగిస్తోంది. ఇదే తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెంటగాన్ అధికారులు సమర్పించిన సైనిక ప్రణాళికల్లో ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకునే ‘అస్సాసినేషన్’ (హత్య) ప్లాన్ కూడా ఉన్నట్లు  వార్తలు రావడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు యుద్ధ మేఘాలకు దారితీస్తాయేమోనన్న అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: శశికళ సంచలన ప్రకటన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)