Breaking News

భారత్‌ దాడులతో వణికిపోయాం.. పాక్‌ డిప్యూటీ పీఎం షాకింగ్‌ వ్యాఖ్యలు

Published on Fri, 06/20/2025 - 08:11

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌ ఎట్టకేలకు భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు పాక్‌ నేతలు ఒక్కొక్కరుగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులోకి పాకిస్తాన్‌ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ చేరిపోయారు. తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌పై ఇషాక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వైమానిక దాడులు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.

పాకిస్తాన్‌ డిప్యూటీ పీఎం ఇషాక్‌ దార్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ మాపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని రెండు ముఖ్యమైన వైమానిక స్థావరాలు రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షోర్‌కోట్ ఎయిర్‌బేస్‌లపై భారత్‌ విరుచుకుపడింది. దీంతో, రెండు ఎయిర్‌బేస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారత్‌పై పాకిస్తాన్ తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. అందుకే ప్రతి దాడి చేయలేకపోయాం. దాడుల విషయంలో భారత్‌ వేగంగా స్పందించింది. భారత్‌తో యుద్ధం అంత తేలిక కాదు.

భారత దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడాలని యువరాజు సూచించారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్‌ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా సైతం భారత్‌ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ చేసిన దాడులను పాక్‌ ప్రధాని అంగీకరించారు. బాలిస్టిక్‌ క్షిపణులతో భారత్‌ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్‌ మునీర్‌ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్‌ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2.30కి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారత్‌ దాడులు చేసిందని మునీర్‌ తనతో చెప్పారన్నారు. ఇక, షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)