Breaking News

భార్య పక్కన ఉండగానే హీరోలా నీళ్లలోకి దూకాడు! కట్​ చేస్తే..

Published on Sat, 02/12/2022 - 10:53

మంచికి పోతే.. ఉన్న సంచీ ఊడిందని అంటుంటారు పెద్దలు. పాపం.. ఆ పెద్దాయన నీళ్లలో కొట్టుకుపోతున్న ఓ అమ్మాయిని మంచి ఉద్దేశంతోనే కాపాడాలనుకున్నాడు. ఉరుకుల మీద వెళ్లి నీళ్లలోకి దూకాడు. ఆ క్షణం.. ఆయన జీవితంలో ఊహించిన షాక్​ తగిలిందట!.

పోర్ట్​ల్యాండ్​కు చెందిన క్రిస్​ ఫోర్డ్​(67) ఒక రిటైర్డ్​ ఫొటోగ్రాఫర్​. సముద్రానికి కొట్టుకువచ్చే శకలాలను, చెక్క ముక్కలను సేకరించడం ఆయన అలవాటు. ఈ మధ్య ఓ సాయంత్రంపూట తన భార్యతో కలిసి సముద్రం ఒడ్డున విహరిస్తున్నాడు. ఇంతలో దూరంగా రెండు తెల్లటి చేతులు నీటిపై తేలుతూ కనిపించాయి. నో డౌట్​.. ఎవరో అమ్మాయే అది అనుకున్నాడు. భార్య పక్కన ఉందనే విషయం మరిచిపోయి(సరదాగానే..) పరిగెత్తుకుంటూ వెళ్లి దభేల్​ మని నీళ్లలోకి దూకి ఆ ప్రాణం కాపాడాలనుకున్నాడు. 

తీరా చూస్తే.. ఈదుకుంటూ దగ్గరికి వెళ్లి చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయట ఆ పెద్దాయనకు. అది ఒక బొమ్మ. అదీ అలాంటి ఇలాంటి బొమ్మ కాదు. తల లేని సె* టాయ్​. అది చూడగానే ఆయన నోట మాట పడిపోయిందట.

ఆ బొమ్మను లాక్కుంటూ బయటకు తీసుకొచ్చాడు. హీరోలా వెళ్లి.. అలాంటి బొమ్మతో ఒడ్డుకు వచ్చిన భర్తను చూసి ఆ భార్య కింద పడి దొర్లుకుంటూ నవ్వుకుందట. పరువు పోయిందనుకుంటూనే..  ఆ సరదా విషయాన్ని ఆయన తన బ్లాగ్​లో పంచుకున్నాడు. 


పైగా తనలాంటి ఎవరో భార్యా బాధితుడే ఇలాంటి పని చేసి ఉంటాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అది బోట్లు ఎక్కువగా తిరిగే ఏరియా. బహుశా ఎవరైనా బోటులో వచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంగ్లండ్​ డోర్​సెట్​ చెసిల్​ తీరం వెంట జరిగిన ఈ ఘటన.. సోషల్​ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)