Breaking News

ప్రముఖ కంపెనీ సీఈవోపై కాల్పులకు తెగబడ్డ నిందితుడు ఇతడే

Published on Mon, 12/09/2024 - 12:48

వాషింగ్టన్‌ : అమెరికాలో ప్రముఖ ఇన్సూరెన్సు సంస్థ యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సీఈవో బ్రియాన్‌ థాంప్సన్‌ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. థాంప్సన్‌ను హత్య చేసిన నిందితుడి ఫొటోలను న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎన్‌వైపీడీ) విడుదల చేసింది. అంతేకాదు నిందితుడిని పట్టించిన వారికి భారీ మొత్తంలో ఫ్రైజ్‌మనీ అందిస్తామని తెలిపింది.

గతవారం, మిడ్‌టౌన్‌లోని హిల్టన్‌ హోటల్‌ బయట ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో థాంపన్స్‌ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్‌ను లక్ష్యంగా కాల్పులు జరిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా థాంపన్స్‌పై దాడి చేసిన నిందితుణ్ని గుర్తించేందుకు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఆ సీసీ కెమెరా ఫుటేజీల్లో నిందితుడి ఆచూకీ లభ్యమైంది. ఆ ఫొటోలను విడుదల చేశారు.

ఆ ఫొటోల్లోని ఒక ఫ్రేమ్‌లో థాంప్సన్‌ను హత్య చేసిన అనంతరం ఓ ట్యాక్సీలో తాపీగా కూర్చున్నాడు. రెండో ఫ్రేమ్‌లో బ్లాక్‌ డౌన్‌ జాకెట్‌ ధరించి వీధిలో నడుచుకుంటూ వస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.  వాటిల్లో  ఒకటి అనుమానితుడు కెమెరాను నేరుగా చూస్తూ, టాక్సీ డ్రైవర్‌తో విండో ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నట్లు చూపిస్తుంది. హిల్టన్ హోటల్ వెలుపల థాంపన్స్‌  జరిగిన తర్వాత అనుమానితుడు సెంట్రల్ పార్క్ సమీపంలో టాక్సీ తీసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.

ఫోటోల విడుదల అనంతరం, పోలీసు కమిషనర్ జెస్సికా టిస్చ్ మాట్లాడుతూ.. ఫొటోల్లోని నిందితుడి గురించిన సమాచారం అందిస్తే ఎఫ్‌బీఐ 50వేల డాలర్లు బహుమతిని అందిస్తుంది. ఎన్‌వైపీడీ అదనంగా మరో 10వేల డాలర్లు బహుమతిగా అందిస్తున్నట్లు ప్రకటించారు. నిందితుడు దేశం వదిలి పారిపోకుండా సరిహద్దుల్లో పోలీసులు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)