Breaking News

COVID-19: కరోనాను అడ్డుకునే స్ప్రే

Published on Sat, 01/14/2023 - 05:03

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే కొత్త రకం అణువులను అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. సన్నగా, పోగుల మాదిరిగా ఉండే వీటిని సుప్రా మాలిక్యులార్‌ ఫిలమెంట్స్‌గా (ఎస్‌ఎంఎఫ్‌) పిలుస్తున్నారు. వీటిని ముక్కులోకి స్ప్రే చేయడం ద్వారా కరోనాతో పాటు సార్స్‌ తదితర వైరస్‌లను కూడా సమర్థంగా అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. ‘‘కరోనా శ్వాస ద్వారానే సోకుతుందన్నది తెలిసిందే. ఎస్‌ఎంఎఫ్‌ స్పాంజ్‌ మాదిరిగా కరోనా వంటి వైరస్‌లను పీల్చుకుంటుంది.

తద్వారా అవి ఊపిరితిత్తుల్లోని కణాలతో కలిసిపోయి వ్యాధి కారకాలుగా మారకుండా చూస్తుంది’’ అని వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హాంగాంగ్‌ కుయ్‌ వివరించారు. వీటిని ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారట. కరోనా వైరస్‌ సాధారణంగా ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఉండే ఏస్‌2గా పిలిచే రిసెప్టర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. తద్వారా కణంలోకి ప్రవేశించి వృద్ధి చెందుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన ఎస్‌ఎంఎఫ్‌ల్లో ఫిలమెంట్లలోనూ ఇలాంటి సూడో రిసెప్టర్లుంటాయి. కరోనా వైరస్‌ లోనికి తమవైపు ఆకర్షించి అక్కడే నిలువరిస్తాయి. కరోనా తాలూకు అన్ని వేరియంట్లనూ ఇది సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.  

Videos

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

అండర్ గ్రౌండ్ లో అవినీతి తీగ

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)