Breaking News

అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే.. 

Published on Thu, 07/27/2023 - 19:08

ప్యోంగ్ యాంగ్: శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న మాటను నిజం చేస్తూ అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా నార్త్ కొరియాతో చేతులు కలిపాయి. నార్త్ కొరియా విక్టరీ డే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆహ్వానం మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా ప్రతినిధుల బృందంతో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ హాజరయ్యారు. 

ఈ సందర్బంగా జరిగిన ఎగ్జిబిషన్ పెరేడ్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నిషేధించబడిన క్షిపణులను ప్రతినిధి బృందానికి చూపించారు. ఈ సందర్భాంగా రష్యా, చైనా, నార్త్ కొరియా మధ్య ఏర్పడ్డ కొత్త స్నేహాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కిమ్ జోంగ్. అమెరికాతో శత్రుత్వం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ నిషేధించిన ఈ క్షిపణులను ప్రదర్శించి బలప్రదర్శన చేశారు. 

ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రూపంలో కిమ్ జోంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్ జోంగ్ కూడా తమ దేశానికి మిలటరీ ప్రతినిధులను పంపినందుకు రష్యా అధ్యక్షుడికి కృతఙ్ఞతలు తెలిపారు. కిమ్ జొంగ్ మాట్లాడుతూ.. మిలటరీ ప్రతినిధుల పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సంప్రదాయ సంబంధాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఒకే రకమైన ఆలోచనలతో రెండు దేశాల సార్వభౌమత్వం, అభివృద్ధి లక్ష్యంగా సామ్రాజ్యవాదుల కలయిక అంతర్జాతీయ శాంతి, సమన్యాయం  నెలకొల్పే దిశగా ఫలప్రదంగా జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన రష్యా సైన్యం పైనా, ప్రజలపైన అపార నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ కూడా తమ సంతోషసన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ఈ మూడు దేశాలు అమెరికాకు గట్టి సంకేతాలనే పంపాయి. కానీ ఎక్కడా ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం 

ఇది కూడా చదవండి: ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)