Breaking News

Nobel Prize 2025: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

Published on Tue, 10/07/2025 - 15:50

స్టాక్‌హోమ్: 2025 ఏడాదికిగాను నోబెల్‌ పురస్కారాల్లో భాగంగా భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి  ముగ్గురు  శాస్త్రవేత్తలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. జాన్‌ క్లార్క్‌, జాన్‌ ఎం మార్టిన్‌, మైఖేల్‌ హెచ్‌ డెవొరెట్‌లకు నోబెల్‌ పురస్కారాలను ప్రకటించారు. క్వాంటమ్‌ మెకానిక్స్‌ పరిశోధనలకు గాను వీరు ఈ ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు.

వీరి పరిశోధన ఏమిటి?
"మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్క్యూట్‌లో శక్తి పరిమాణీకరణ" అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ పరిశోధనల ద్వారా  క్వాంటమ్ ఫిజిక్స్‌ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్‌లో చూపించగలిగారు. విద్యుత్ సర్క్యూట్‌లో క్వాంటమ్ టన్నెలింగ్, శక్తి స్థాయిల పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించారు.  ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు,  క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది.  ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో  జాన్‌ క్లార్క్‌, జాన్‌ ఎం మార్టిన్‌లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కాగా, హెచ్‌ డెవొరెట్‌ ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్త. 

క్వాంటమ్‌ మెకానిక్స్‌ ఆవశ్యకత..
గ్రహాలు, నక్షత్రాలు తదితరాలతో కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతికశాస్త్రంతో వివరించవచ్చు కానీ... ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్తలో కూడిన అణు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్‌ మెకానిక్స్‌ అవసరం అవుతుంది. ఎనర్జీ క్వాంటిజేషన్‌, టన్నెలింగ్‌లు అట్లాంటి అణుస్థాయి కార్యకలాపాలు. శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయుల్లో ఉంటుందని ఎనర్జీ క్వాంటిజేషన్‌ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.. 

ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్‌ను ఉపయోగిస్తూంటారు కదా.. అచ్చం అలాగే శక్తిని కూడా నెమ్మదిగా హెచ్చుతగ్గులకు గురవుతుందన్నమాట. దీన్నే ఎనర్జీ క్వాంటిజేషన్‌ అంటారు. అయితే అణుస్థాయిలో ఇలా ఉండదు. శక్తి అనేది మెట్లు ఎక్కినట్లు దశలు, దశలుగా ఉంటుంది. ఈ ఏడాది నోబెల్‌ అవార్డు గ్రహీతలు ఈ ఎనర్జీ క్వాంటిజేషన్‌ను కూడా అరచేతిలో పట్టేంత, పూర్తిగా నియంత్రితమైన వ్యవస్థల్లోనూ చూపగలిగారు.

క్వాంటమ్‌ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం. ఈ ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంతో పనిచేయగల క్వాంటమ్‌ కంప్యూటర్లకు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలేర్పడింది. గూగూల్‌, ఐబీఎంలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సూపర్‌ కండక్టింగ్‌ క్యూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగా తయారయ్యాయి. కంప్యూటింగ్‌ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిట్లలో ఎనర్జీ క్వాంటిజేషన్‌, టన్నెలింగ్‌ వంటివి ఆధారమవుతాయి.

అంతేకాదు.. ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్‌ సెన్సర్ల తయారీ వీలవుతుంది. ఎమ్మారై, అల్ట్రాసౌండ్‌ వంటి వైద్య పరీక్షలు మరింత వివరంగా స్పష్టంగా చేసే వీలేర్పడుతుంది. తద్వారా వ్యాధులను చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్‌, జియలాజికల్‌ సర్వేల్లోనూ ఈ సెన్సర్లను ఉపయోగించవచ్చు. స్పేస్‌ టెలిస్కోపులు, గ్రావిటేషనల్‌ వేవ్‌ డిటెక్టర్లలో క్వాంటమ్‌ సెన్సర్ల వాడకం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.  హ్యాకింగ్‌ వంటి సమస్యల్లేకుండా అత్యంత సురక్షితంగా సమాచారాన్ని పంపేందుకు అవసరమైన క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయవచ్చు

ఇదిలా ఉంచితే, నిన్న(సోమవారం, అక్టోబర్‌6) వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాలు ప్రకటించగా, ఈరోజు(మంగళవారం, అక్టోబర్‌(7) భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాలును ప్రకటించారు. రేపు(బుధవారం, అక్టోబర్‌ 8) రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాలు ప్రకటించనున్నారు.  ఆపై వరుసగా సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్రాల్లో నోబెల్‌ పురస్కారాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 10న, అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా  స్వీడన్‌లోని స్టాక్‌హోమ్, నార్వేలోని ఒస్లో నగరాల వేదికగా ఈ బహుమతులు అందజేస్తారు.

ఇదీ చదవండి: 
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)