Breaking News

స్వేచ్ఛా నినాదాలతో జైలుగోడలు ప్రతిధ్వనించాయి

Published on Tue, 12/10/2024 - 06:21

ఓస్లో, నార్వే: నోబెల్‌ శాంతి బహుమతి–2023 గ్రహీత, ఇరాన్‌కు చెందిన హక్కుల ఉద్యమకారిణి నర్గీస్‌ మహమ్మదీ తొలిసారి నోబెల్‌ ప్యానెల్‌తో మాట్లాడారు. అనారోగ్య రీత్యా బెయిలుపై ఉన్న ఆమెతో మాట్లాడినట్లు ఆ సంస్థ ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు నోబెల్‌... సోషల్‌ మీడియాలో వీడియోను విడుదల చేసింది. తనకు నోబెల్‌ వచ్చి విషయం కూడా నేరుగా తెలియలేదని, జైలులో తనతోపాటు ఉన్న మహిళ.. పురుషుల వార్డులో ఉన్న భర్తతో ఫోన్‌లో మాట్లాడగా విషయం తెలిసిందని చెప్పారు. 

వార్త వినగానే నమ్మలేకపోయామని, ‘ఉమెన్‌.. లైఫ్‌.. ఫ్రీడమ్‌’నినాదాలతో జైలు ప్రతిధ్వనించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ఆనందంతో ఆమె ‘బెల్లా చావ్‌’స్వేచ్ఛాగీతాన్ని కూడా ఆలపించారు. తన ఆరోగ్య సమస్యల గురించి, ఇరాన్‌ రాజకీయ వాతావరణం గురించి కూడా ఆమె ప్యానెల్‌కు వివరించారు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా తన పిల్లలతో వీడియో కాల్‌లో మాట్లాడగలిగానని తెలిపారు. ఇరాన్‌లో మహిళలకు హిజాబ్‌కు, మరణశిక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్‌.. ఎవిన్‌ జైల్లో ఉన్నారు.

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)