Breaking News

నోబెల్‌ గ్రహీత నర్గీస్‌ విడుదల

Published on Fri, 12/06/2024 - 00:31

పారిస్‌: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీ బుధవారం ఇరాన్‌లోని టెహ్రాన్‌లోని ఎవిన్‌ కారాగారం నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలరీత్యా ఆమెకు మూడు వారాలపాటు శిక్షను నిలుపుదల చేసి జైలు అధికారులు విడుదలచేశారు. తిరిగి జైలులో లొంగిపోయాక ఈ మూడువారాలు అదనంగా శిక్షాకాలంగా అనుభవించాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో తొలిసారిగా తన తల్లితో ఫోన్‌లో మాట్లాడానని పారిస్‌లో ఉంటున్న నర్గీస్‌ కుమారుడు అలీ రహ్మానీ తెలిపారు. 

ఆమె జైలు నుంచి విడుదలయ్యాక 2022–2023 నిరసన ఉద్యమ నినాదం అయిన ‘మహిళల జీవితానికి స్వేచ్ఛ లభించాలి’అని నినదించారు. ‘‘ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా మానసికంగా బాగున్నారు. పోరాట పటిమ ఆమెలో అలాగే ఉంది. హిజాబ్‌ లేకుండా జైలు నుంచి బయటకు రాగలిగా’’అని తన తల్లి చెప్పిందని కుమారుడు రహా్మనీ వెల్లడించారు. మహిళల హక్కులకోసం ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె అలుపెరగని పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. 

ఇరాన్‌లో హిజాబ్‌ ధారణపై అత్యంత కఠిన చట్టాలు, ఇతర నేరాలకు మరణశిక్ష అమలును వ్యతిరేకంగా పోరాడిన నర్గీస్‌ను అరెస్ట్‌ చేసిన ఇరాన్‌ పోలీసులు పల సెక్షన్ల కింద దోషిగా తేల్చారు. దీంతో ఆమె 2021 నవంబర్‌ నుంచి ఎవిన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దశాబ్ద కాలంగా జైలు జీవితం గడుపుతున్న ఆమె కొన్నేళ్లుగా కనీసం భర్త, కవల పిల్లలను చూడలేదు. 

ఆమె కారాగార శిక్ష అమలును 21 రోజులు నిలుపుదల చేశారని, ఆ 21 రోజులను ఆమె తిరిగి జైలుకెళ్లాక అదనంగా శిక్షాకాలాన్ని అనుభవించాల్సి ఉంటుందని ఆమె మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బెయిలును కనీసం మూడు నెలలకు పొడిగించాలని ఆమె మద్దతుదారులు డిమాండ్‌ చేశారు. ఆమె అనారోగ్యం కారణంగా వైద్యుల సలహా మేరకు ప్రాసిక్యూటర్‌ విడుదలకు అనుమతించారని న్యాయవాది ముస్తఫా నీలీ తెలిపారు. 

ఆమెకు ఉన్న కణితి ప్రాణాంతకం కాదని, అయితే ప్రతి మూడు నెలలకోసారి ఆమెకు వైద్యపరీక్షలు అవసరమని లాయర్‌ వెల్లడించారు. జైలులోనూ నర్గీస్‌ పోరాట మార్గాన్ని వీడలేదు. ఎవిన్‌ జైలు ఆవరణలో నిరసనలు చేపట్టారు. నిరాహార దీక్షలు చేశారు. ఇరాన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణమైన అణచివేతను ఆమె సెప్టెంబర్‌లో జైలు నుంచి రాసిన లేఖలోనూ ఖండించారు. 2022–2023లో అయతుల్లా అలీ ఖమేనీ ఆధ్వర్యంలో ఇస్లామిక్‌ అధికారులను గద్దె దింపాలని కోరుతూ జరిగిన నిరసనలకు నర్గీస్‌ పూర్తి మద్దతు తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు జూన్‌లో ఆమెకు మరో ఏడాది జైలు శిక్ష పడింది.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)