Breaking News

కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్‌

Published on Thu, 10/17/2024 - 08:36

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌ ప్రమేయముందని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యలో దౌత్యపరమైన విభేదాలు చెలరేగాయి. అయితే.. భారత్‌పై ఆరోపణలతో ఊదరగొట్టిన జస్టిన్‌ ట్రూడో వెనక్కితగ్గారు. ఇక.. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే తాము భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు అంగీకరించారు. దీంతో కెనడా ప్రధాని తీరును భారత్‌ తీవ్రంగా ఖండిచింది.  

‘‘చాలా రోజులుగా మేం చెబుతున్న విషయమే నిర్ధారణ అయింది. భారతదేశం, భారతీయ దౌత్యవేత్తలపై కెనాడా చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎటువంటి సాక్ష్యాలను మాకు అందించలేదు. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని నిరూపితమైంది. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం ప్రధాని ట్రూడోనే’’ అని భారత  విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ ఎక్స్‌వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.‌ మరోవైపు.. విదేశీ జోక్యంపై పార్లమెంటరీ విచారణలో కెనడాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రధాని ట్రూడో విమర్శలను భారత ప్రతినిధులు ధీటుగా తిప్పికొట్టారని అన్నారు.

చదవండి: Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)