Breaking News

గాజాకు ఇజ్రాయెల్‌ డెడ్లీ వార్నింగ్‌

Published on Thu, 10/12/2023 - 16:14

గాజాను గుప్పిట పట్టిన ఇజ్రాయెల్‌ సైన్యం .. అక్కడి ప్రజల విషయంలో అత్యంత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ సమాజం పిలుపు ఇచ్చినా సరే మానవతా దృక్ఫథంతో వ్యవహరించేది లేదని తేల్చేసింది. బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరుల్ని హమాస్‌ విడుదల చేసేదాకా.. గాజా పౌరులకు కనీసం మంచి నీళ్లు కూడా అందవని స్పష్టం చేసింది.

మంచి నీరు, కరెంట్‌ కోతతో గాజా ప్రజలు అల్లలాడిపోతున్నారంటూ గాజా క్షేత్రస్థాయి పరిస్థితులపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో.. కనికరించి మానవతా సాయానికి ముందుకు రావాలంటూ రెడ్‌ క్రాస్‌ ఇజ్రాయెల్‌ను అభ్యర్థించింది. మరికొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌ను ఇదే కోరాయి. అయితే ఈ పిలుపుపై ఇజ్రాయెల్‌ మంత్రి కాట్జ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. 

‘‘గాజాకు మానవతా సాయమా?.. ఎట్టి పరిస్థితుల్లో అది వీలు పడదు. బంధీలుగా ఉంచిన ఇజ్రాయెల్‌ పౌరులు సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు గాజా ప్రజలకు కరెంట్‌, మంచి నీళ్లు.. మనుషులకే కాదు ఆఖరికి అక్కడి వాహనాలు కదిలేందుకు కావాల్సిన చమురు కూడా అందదు. మాకు ఎవరూ నీతులు బోధించకండి’’  అని స్పష్టం చేశారాయన. 

శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్‌ గ్రూప్‌ మెరుపుదాడి తర్వాత.. గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్‌ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకుంది. ఆ తర్వాత జరుగుతున్న పరస్పర దాడులతో భాగంగా.. గాజాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించుకుంది. ఇందుకు కోసం జరిపిన దాడుల్లో 1200 మందిని చంపింది. 5వేల మందిని గాయపర్చింది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పవర్‌ ప్లాంట్‌ ఇంధనం కొరత కారణంగా పని చేయడం ఆగిపోయింది. దీంతో ఆస్పత్రులకు సైతం కరెంట్‌ సరఫరా నిలిచిపోయి.. పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్‌ సానుకూలంగా స్పందించాలంటూ ఇజ్రాయెల్‌ను కోరుతోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)