Breaking News

నీరవ్‌ మోదీ కేసులో కీలక పరిణామం.. అప్పగింతకు గ్రీన్‌ సిగ్నల్‌!

Published on Sat, 10/04/2025 - 10:54

లండన్‌: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే సిద్ధమైంది.  ప్రస్తుతం బ్రిటన్‌ జైల్లో ఉన్న నీరవ్‌ మోదీని.. వచ్చే నెల 23వ తేదీన భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.  ముంబై ఆర్డర్‌ రోడ్‌ జైల్లో నీరవ్‌ మోదీని ఉంచే అవకాశం ఉంది. 

గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్‌(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్‌ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది.  

అయితే తాజాగా  నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సమాచారం.  నీరవ్‌ మోదీకి భారత్‌లో అన్ని వసతులు కల్పిస్తామని, అత్యంత కట్టుదిట్టమైన ముంబై ఆర్డర్‌ రోడ్‌ జైల్లో ఉంచుతామని భారత్‌ హామీ ఇవ్వడంతో బ్రిటన్‌ కోర్టు అందుకు అంగీకరించింది. దాంతో నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించాలని ప్రయత్నానికి మార్గం సుగుమం అయ్యింది. 

కాగా, ఈ ఏడాది జూలై నెలలో నీరవ్‌ మోదీ సోదరుడు నేహల్‌ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్  కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు నేహల్‌పై ఆరోపణలు ఉన్నాయి మనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. 

ఇదీ చదవండి: 
ట్రంప్ ప్రణాళికపై హమాస్‌ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)