Breaking News

‘దయ చూపండి.. మా అమ్మ ఉరిశిక్షను ఆపండి’

Published on Mon, 07/28/2025 - 20:31

యెమెన్‌ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జీవన్మరణ పోరాటం చేస్తున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  కొన్ని రోజులు క్రితం ఆమెకు పడాల్సిన ఉరిశిక్ష చివరి నిమిషంలో రద్దు కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నిమిష. 

బ్లడ్‌మనీ(క్షమాధనం లేక నష్టపరిహారం)  ఇచ్చేందుకు కూడా సిద్ధమైన తరుణంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే బాధిత తలాల్‌ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం తమకు బ్లడ్‌మనీ వద్దని ఇప్పటికే తెగేసి చెప్పింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది. దాంతో నిమిష ఉరిశిక్ష రద్దు అనేది పక్కకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా నిమిష కూతరు 13 ఏళ్ల మిషెల్‌ తన తల్లియందు దయ చూపించాలని యెమెన్‌ అధికారుల్ని వేడుకోంటుంది.  ఈ మేరకు మలయాళం, ఇంగ్లిష్‌ భాషల్లో తల్లిని రక్షించాలంటూ ప్రాధేయపడుతోంది. 

‘ఐ లవ్‌ యూ మమ్మీ. ఐ మిస్‌ యూ. మా అమ్మను తిరిగి వెనక్కి పంపడానికి సాయం చేయండి. మా అమ్మ పట్ల దయ చూపండి. తలాల్‌ కుటుంబానికి థాంక్స్‌ చెప్పేందుకు మిషెల్‌ ఇక్కడ ఉంది. మీరు మా అమ్మపై కరుణ చూపి అక్కడ నుంచి విడుదలకు మార్గం చూపండి.  

రేపు, రేపు మరుసటి రోజు మీ పట్ల మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని వేడుకుంటోంది.  ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌తో కలిసి నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్‌లో తమ తమ ప్రయత్నాల్లో  ఉన్నారు. ఈ క్రమంలోనే కేఎ పాల్‌తో కలిసి నిమిష కూతురు మిషెల్‌ మీడియాతో మాట్లాడింది. 

#

Tags : 1

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)