Breaking News

Nikki Haley: అమెరికా ఏమీ ప్రపంచ ఏటీఎం కాదు!

Published on Wed, 03/01/2023 - 09:14

అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతున్నరిపబ్లిక్‌  పార్టీ అ‍భ్యర్థి నిక్కీ హేలి ముందస్తుగా గట్టి ప్రచారం ప్రారంభించారు. ఇటీవలే అమెరికా విదేశాంగ విధానంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే అమెరికాను వ్యతిరేకించే దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని తేల్చిచెప్పారు. అలాగే పాక్‌లాంటి చెడ్డ దేశాలకు వందల మిలయన్ల డాలర్లు ఇవ్వనని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు నిక్కీ మంగళవారం ఆ వ్యాఖ్యలనే పునరుద్ఘాటిస్తూ.. బలహీనమైన అమెరికానే చెడ్డ వ్యక్తులకు చెల్లిస్తుందంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. గతేడాది పాక్‌, ఇరాక్‌, జింబాబ్వేలకు వందల మిలియన్ల డాలర్ల సాయం అమెరికా చేసిందన్నారు.

బలమైన అమెరికా అలా చేయదని, అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదని ట్విట్వర్‌ వేదికగా పేర్కొన్నారు నిక్కీ హేలీ. మరో ట్వీట్‌లో అమెరికా ప్రపంచ ఏటీఎం కాకుడదని, తాను అధికారంలోకి రాగానే విదేశాంగ విధానంలో తీవ్ర మార్పులు చేస్తామని, శత్రువులకు డబ్బులు పంపకుండా గట్టి ప్రణాళికలు పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు. అంతేగాదు గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల కష్టార్జితాన్ని వృధా చేయదంటూ బైడెన్‌ పరిపాలనపై విచుకుపడ్డారు. అలాగే అమెకాను ద్వేషించే దేశాల సరసన నిలిబడే దేశాలకు నిధులందించ కూడదంటూ బైడెన్‌ ప్రభుత్వాన్ని తిట్టిపోశారు.

ఇదిలా ఉండగా, అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన తదుపరే అమెరికా విదేశా విధానంపై తనదైన శైలి విమర్శలు గుప్పిస్తూ జోరుగా ‍ప్రచారం చేస్తున్నారు నిక్కీ. దీంతో 2024 అమెరికా అధ్యక్ష రేస్‌కి సంబంధించిన తాజా ఓపెనియన్‌ పోల్‌లో అనుహ్యంగా బైడెన్‌ కంటే ముందంజలో ఉన్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది.  ఐతే ఫిబ్రవరి 16 మరియు 19 మధ్య నిర్వహించిన రాస్ముస్సేన్  సర్వే ఆధారంగా మాత్రం నిక్కీ హేలీ.. ట్రంప్‌ కంటే వెనుకబడి ఉందని తెలిపింది.  కాగా, యూఎస్‌ అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5, 2024న జరగాల్సి ఉంది. 

(చదవండి: పాక్‌, చైనాలకు సాయం కట్‌ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి)

#

Tags : 1

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)