Breaking News

పన్నూ హత్య కేసు: న్యూయార్క్‌ కోర్టులో నిఖిల్‌ గుప్తా వాదన ఇదే..

Published on Tue, 06/18/2024 - 09:47

వాషింగ్టన్‌: ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కేసులో నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న భారత సంతతి నిఖిల్‌ గుప్తాను పోలీసులు న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా వాదనల అనంతరం కేసు విచారణను కోర్టు జూన్‌ 28వ తేదీకి వాయిదా వేసింది.

అయితే, ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్‌ సింగ్‌ పన్నూను చంపేందుకు ఒక కిరాయి హంతకుడిని వియోగించాడనే ఆరోపణను ఎదుర్కొంటున్న నిఖిల్‌ గుప్తా (52)ను చెక్‌ రిపబ్లిక్‌ గత వారంలో అమెరికాకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రూక్లిన్‌ లోని ఫెడరల్‌ మెట్రోపాలిటన్‌ నిర్బంధ కేంద్రంలో ఉన్న గుప్తాను సోమవారం న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో హాజరుపరిచారు.

ఈ క్రమంలో వాదనల సందర్భంగా గుప్తా ముందస్తుగా 15,000 డాలర్లు ఇచ్చి ఒక కిరాయి హంతకుడిని వియోగించాడని అమెరికా ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తనపై అన్యాయంగా అభియోగాన్ని మోపారని గుప్తా చెప్పుకొచ్చారు. మరోవైపు.. భారత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి ఆదేశం మేరకు పన్నూ హత్యకు గుప్తా కుట్రపన్నాడని ప్రాసిక్యూషన్‌ ఆరోపిస్తోంది. ఇరు వాదనలు విన్న అనంతరం, ఈ కేసు విచారణను జూన్‌ 28వ తేదీకి వాయిదా వేసింది. 28వ తేదీ వరకు గుప్తా పోలీసుల కస్టడీలోనే ఉండాలని ఆదేశించింది. గుప్తాకు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

ఇదిలా ఉండగా.. చెక్ రిపబ్లిక్ పోలీసులు నిఖిల్ గుప్తాను యునైటెడ్ స్టేట్స్‌కు అప్పగించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)