Breaking News

'ఎన్ని వైర‌స్‌లు వ‌చ్చినా మేం భయ‌ప‌డం'

Published on Fri, 07/31/2020 - 17:52

ఒరెగాన్ : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దాటికి విశ్వ‌వ్యాప్తంగా అన్ని ర‌కాల క్రీడ‌లు స్తంభించిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే మెళ్లిగా ఇప్పుడిప్పుడే అన్ని ర‌కాల క్రీడ‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఆట ఏదైనా స‌రే జ‌నాలు మైదానంలోకి గుంపులుగా రాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ఖ్యాత స్పోర్ట్ అడ్వ‌ర్టైజింగ్ కంపెనీ నైక్ క‌రోనా వైర‌స్‌కు బ‌య‌ప‌డేది లేదంటూ త‌న ట్విట‌ర్ ద్వారా ఒక ఉత్తేజ‌ప‌రిచే వీడియోతో మ‌న ముందుకొచ్చింది. దాదాపు 1.39 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో అన్ని ర‌కాల క్రీడ‌ల‌తో పాటు 36 మంది పాత‌త‌రం, కొత్త‌త‌రం స్టార్ ఆట‌గాళ్ల‌ను కలిపి చూపించారు. ర‌ఫెల్ నాద‌ల్‌, జొకొవిచ్‌, టీమిండియా క్రికెట్‌ మ‌హిళ‌ల టీం, క్రిస్టియానో రొనాల్డొ, సెరెనా విలియ‌మ్స్‌, లెబ్ర‌న్ జేమ్స్‌, కొలిన్ కెపెర్‌నిక్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు క‌నిపిస్తారు. ('నాకు క‌రోనా వ‌చ్చి మేలు చేసింది')

'వీ ఆర్ నెవ‌ర్ ఎలోన్..' అంటూ సాగే వీడియో ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. 'క‌రోనా లాంటి ఎన్ని వైర‌స్‌లు వ‌చ్చినా మేం బభయ‌ప‌డం. అథ్లెట్స్‌గా మేం ఎప్పుడు ఒంట‌రివాళ్లం కాదు.. మేమంతా ఐక్యంగా ఉంటూనే ఏ విష‌య‌మైనా క‌లిసే పోరాడుతాం. మా ఆట‌లే మ‌మ్మ‌ల్ని ఈరోజుకు ఐక్యంగా ఉండేలా చేశాయి. క‌రోనా వైర‌స్ ఆట‌కు మ‌మ్మ‌ల్ని దూరం చేసినా.. తిరిగి మ‌ళ్లీ అదే శక్తితో క‌ల‌సిక‌ట్టుగా వ‌స్తున్నాం' అంటూ ఫీమేల్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో కొన‌సాగుతుంది. ఈ వీడియోకు అమెరిక‌న్ సాక‌ర్ ప్లేయ‌ర్ మేడన్ రాపినో వాయిస్ ఓవ‌ర్ అందించారు. యూ కాంట్ స్టాప్ స్పోర్ట్‌.. యూ కాంట్ స్టాప్ అస్ అంటూ క్యాప్ష‌న్ జ‌త చేశారు. ప్ర‌స్తుతం నైక్ రూపొందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక్క‌రోజులోనే దాదాపు 13 మిలియ‌న్ల మంది వీక్షించారు.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)