Breaking News

తప్పతాగి కారు నడిపి.. నడిరోడ్డుపై మహిళా మంత్రి హల్‌చల్‌..

Published on Mon, 07/24/2023 - 17:59

న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ తప్ప తాగి డ్రైవింగ్ చేసిన కేసులో తన పదవికి రాజీనామా చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి ఓ ప్రమాదానికి కారణం అయినందున ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తప్పని స్థితిలో అరెస్టుకు ముందే ఆమె తన మంత్రి పదవికి అలెన్‌ రాజీనామా చేశారు. 

ఆదివారం రాత్రి పూటుగా మద్యం సేవించి తన కారుతో పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. అంతేకాకుండా అలెన్‌ అరెస్టుకు ఆమె ఏమాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అదే రాత్రి ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించి అక్కడే ఉంచారు. 

ఈ ఘటనపై స్పందించిన ప్రధాని క్రిస్ హిప్రిన్స్.. మంత్రి అలెన్ మానసికంగా కృంగిపోయి ఉన్నారని తెలిపారు. పదవి బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా లేరని తెలిపారు. పైగా క్రిమినల్ కేసు అయినందున రాజీనామాను అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే.. పార్లమెంట్ సభ్యురాలిగా మాత్రం కొనసాగనున్నట్లు తెలిపారు. 

లేబర్ పార్టీలో చాలా వేగంగా ఎదిగిన అలెన్.. వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నారు. జీవిత భాగస్వామి నుంచి విడిపోయిన నాటి నుంచి ఆమె మానసికంగా దెబ్బతిన్నారు. ఈ ఏడాది అక‍్టోబర్‌లో న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే లేబర్ పార్టీ నుంచి మంత్రి పదవి కోల్పోయినవారిలో అలెన్ నాలుగో మంత్రి కావడం గమనార్హం.   

ఇదీ చదవండి: అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య కుదిరిన ఒప్పందం 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)