Breaking News

దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే.. మీరు జీనియస్‌!

Published on Sun, 06/25/2023 - 11:28

ప్రపంచంలో అనేక చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటి గురించి విన్నప్పుడు,చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిదే న్యూజిలాండ్‌లోని ఒక పట్టణం పేరు. ఇది ఎంతపెద్దగా ఉంటుందంటే, దానిని పూర్తిగా చదవాలంటే పెద్ద జీనియస్‌ అయి ఉండాలి. ఆ పొడవైన పేరుగల పట్టణం గురించి, దాని వెనుకగల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ పట్టణం ఎక్కడుంది? 
ఈ విచిత్రమైన పేరు గల పట్టణం న్యూజిలాండ్‌కి దక్షిణాన గల Porangahau పర్వత శ్రేణుల సమీపంలో ఉంది. ఈ పట్టణం పేరు Taumatawhakatangihangako auauotamateaturipukakapikikungungororukupokaiaienuakitanatahu. ఈ అ‍క్షరాలను చూస్తే.. ఎవరో కీబోర్డును అడ్డదిడ్డంగా ఒకేసారి టైప్‌ చేశారేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఇది ఎంతో ఓపికతో చేసిన టైపింగ్‌ పదమే. ఇది ఎప్పటిదో అనుకుంటున్నారేమో..నేడు కూడా ఆ పట్టణం పేరు ఇదే. అయితే ఈ పట్టణం పేరును సులభంగా పలికేందుకు Taumata అని పిలుస్తారు. ఈ పట్టణం పేరులో మొత్తం 85 అక్షరాలున్నాయి. ఈ పట్టణం పేరు ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ కారణంగానే ఈ పట్టణం పేరు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో నమోదయ్యింది. 

ఈ పేరు అర్థం ఏమిటంటే..
Taumatawhakatangihangakoauauotamateaturipukakapikiku

ngungororukupokaiaienuakitanatahu.. ఇంత పెద్ద పేరు చూడగానే ఎవరికైనా దీని అర్థం ఏమిటని మనసులో సందేహం తలెత్తుతుంది. ఈ పదానికి అర్థం ఏమిటంటే..‘ఇది ఎటువంటి ప్రాంతమంటే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, పర్వతాలు అధిరోహించేవారు, ప్రపంచాన్నంతా కలియతిరిగేవారు, సుందరమైన Koauau ఫ్లూట్‌ వాయించే Tamatea ప్రజలు ఉండే ప్రాంతం’. 

అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి..
ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి గురించి తెలుసుకుందాం. అత్యంత పొడవైన పేరు కలిగినందున యువతి పేరు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ యువతి పేరు 1000 అక్షరాలకు మించి ఉంటుంది. ఈ పేరు పూర్తిగా  చదవాలంటే ఎవరికైనా చెమటలు పడతాయి. ఇంత పెద్ద పేరు కలిగిన ఈ యువతి బర్త్‌ సర్టిఫికెట్‌ రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఈ యువతి పూర్తి పేరు..

Rhoshandiatellyneshiaunneveshenkescianneshaimondrischlyndasaccarnae renquellenendrasamecashaunettethalemeicoleshiwhalhinive'onchellecaundenesh eaalausondrilynnejeanetrimyranaekuesaundrilynnezekeriakenvaunetradevonneya vondalatarneskcaevontaepreonkeinesceellaviavelzadawnefriendsettajessicanneles ciajoyvaelloydietteyvettesparklenesceaundrieaquenttaekatilyaevea'shauwneorali aevaekizzieshiyjuanewandalecciannereneitheliapreciousnesceverroneccalovelia tyronevekacarrionnehenriettaescecleonpatrarutheliacharsalynnmeokcamonaeloies alynnecsiannemerciadellesciaustillaparissalondonveshadenequamonecaalexetiozetia quaniaenglaundneshiafrancethosharomeshaunnehawaineakowethauandavernellchishankcarl inaaddoneillesciachristondrafawndrealaotrelleoctavionnemiariasarahtashabnequcka gailenaxeteshiataharadaponsadeloriakoentescacraigneckadellanierstellavonnemyiat angoneshiadianacorvettinagodtawndrashirlenescekilokoneyasharrontannamyantoniaaquin ettesequioadaurilessiaquatandamerceddiamaebellecescajamesauwnneltomecapolotyoajohny aetheodoradilcyana.

ఇది కూడా చదవండి: 56 కి.మీ మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)