Breaking News

‘మీరు ఒక్క క్షిపణి దాడి చేశారు.. ఇక మేమేంటో చూపిస్తాం’

Published on Sun, 05/04/2025 - 21:32

టెల్ అవీవ్:  తమ దేశంపై హౌతీ రెబల్స్ చేసిన క్షిపణ దాడికి అంతకుమించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాము ఏంటో చూపిస్తామంటూ హౌతీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. ‘ మీరు ఒక క్షిపణి దాడిని మాపై ప్రయోగించారు.  దానికి ప్రతీకారం ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తారు. మీరు చేసిన దాడుల కంటే ఏడు రెట్లు అధికంగా మా దాడి ఉంటుంది. 

గాజాలో ఉన్న పాలస్తీయుల పట్ల సానుభూతి  నాటకంతో డ్రామాలు చేస్తున్నారు. మేము గతంలో మీపై యుద్ధం చేశాం. భవిష్యత్ లో కూడా చేస్తూనే ఉంటాం. మీలాగ ఒక్క దాడి కాదు. క్షిపణుల వర్షం కురిపిస్తాం. యూఎస్ తో సమన్వయం చేసకుంటూ ముందుకెళ్తాం. మేము, యూఎస్ కలిసి మిమ్మల్ని అంతమొందిస్తాం’ అని మాట్లాడిన వీడియో ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు ఇజ్రాయిల్ ప్రధాని.

 

కాగా, హౌతీ తిరుగుబాటు దారుటు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది.  మిస్సైల్‌ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని  క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)