Breaking News

గాజా ఆక్రమణకు నెతన్యాహూ చర్యలు

Published on Wed, 08/06/2025 - 05:02

జెరూసలేం: గాజా ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకునేందుకే ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే గాజాలోని మూడొంతుల ప్రాంతం ఇజ్రాయెల్‌ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. తాజాగా, బందీల విడుదలపై హమాస్‌ సానుకూలంగా లేకపోవడం కారణంగా నెతన్యాహూ తీసుకున్న నిర్ణయం ఫలితంగా మిలటరీ ఆపరేషన్‌ ఈ ప్రాంతంలో మరింతగా విస్తరించనుంది. హమాస్‌ బందీలను దాచి ఉంచిన ప్రాంతం కూడా ఇందులో ఉందని మీడియా అంటోంది.

గాజా పూర్తి స్థాయి ఆక్రమణ ప్రయత్నాలపై నెతన్యాహూ కార్యాలయం స్పందించలేదు. సైనిక చర్యపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇజ్రాయెల్‌ సీని యర్‌ అధికారిని ఉటంకిస్తూ ‘చానెల్‌ 12’ పేర్కొంది. ‘హమాస్‌ పూర్తిగా లొంగిపోకుండా మిగతా బందీలను విడుదల చేయదు. మేం కూడా లొంగిపోము. ఇప్పుడు ఎలాంటి చర్యా తీసుకోకుంటే బందీలు ఆకలితో చనిపోతారు, గాజా హమాస్‌ నియంత్రణలోనే ఉంటుంది’అని ఆ అధికారి చెప్పినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌ ప్రణాళికలపై పాలస్తీనా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)