Breaking News

ఇజ్రాయెల్‌లో ఉత్కంఠ.. ప్రధాని రేసులో కీలక పరిణామం

Published on Mon, 11/02/2026 - 10:06

జెరూసలేమ్: ఇజ్రాయెల్ రాజకీయాలను ఊపేసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు హంగ్‌గా ముగిశాయి. పోలింగ్, కౌంటింగ్ పూర్తయినా ఏ ఒక్క కూటమికీ మ్యాజిక్ ఫిగర్ అందకపోవడంతో.. దేశంలో తీవ్ర రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. తదుపరి ప్రధాని పీఠం ఎవరి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.

గత అక్టోబర్ 27న ఇజ్రాయెల్ పార్లమెంట్ (కనెసెట్) ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మెజార్టీకి (మ్యాజిక్ ఫిగర్) 68 స్థానాలు అవసరం కాగా, ఏ పార్టీకి ఆ స్థాయి బలం దక్కలేదు. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చెందిన లికుడ్ పార్టీ కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. ఇక మాజీ సైనిక దళాల చీఫ్ గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యాషర్ పార్టీ కూటమి 48 స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన అరబ్ కూటమి పార్టీలు 19 స్థానాల్లో విజయం సాధించి కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తున్నాయి.

అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్‌కోట్ ప్రధాని రేసులోకి..?
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఇతరుల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విపక్ష కూటమి అడుగులు వేస్తోంది. ఇతర అరబ్ పార్టీలను కలుపుకుని గాడి ఐసెన్‌కోట్ తదుపరి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి పీఠాన్ని అధీష్టించనున్నారనే ఊహాగానాలు తొలి దశలో గట్టిగా వినిపించాయి.

నెతన్యాహు వ్యూహాత్మక అడుగులు!
అయితే, ఈ రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తూ అనూహ్య పరిణామాలు తెరపైకి వచ్చాయి. గాడి ఐసెన్‌కోట్ మద్దతుతో,విపక్షాలతో ఒక ఒప్పందానికి వచ్చి మళ్లీ తానే ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలను బెంజమిన్ నెతన్యాహు పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న నెతన్యాహు, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఎలాంటి రాజకీయ వ్యూహాలు రచిస్తారనేది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)