జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్‌..!.. ఆచూకీ చెబితే..

Published on Tue, 08/08/2023 - 07:10

ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌ జిల్లా జైలులో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ సంబంధిత ఆరోపణలతో బందీగా ఉంటున్న నేపాలీ యువతి జైలు గోడ దూకి పారిపోయింది. దుస్తులతో తాడు తయారు చేసుకుని, దాని సాయంతో ఆ యువతి గోడ దూకి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను పట్టుకునేందుకు 12 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమె నేపాల్‌ పారిపోయే అవకాశం ఉన్నందున సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)సాయంతో పోలీసులు నేపాల్‌ సరిహద్దుల్లో చెకింగ్‌ కట్టుదిట్టం చేశారు. 

ఆచూకీ చెబితే రూ. 10 వేలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిథోర్‌గఢ్‌ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గల సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో ఆ  యువతిని వెదికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేలు అందజేస్తామని తెలిపారు. పరారైన యువతిని పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. 

మాదకద్రవ్యం తరలిస్తుండగా..
నేపాల్‌లోని దుమలింగ్‌ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్‌ ఆకృతి(25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్‌ (మాదకద్రవ్యం)తరలిస్తుండగా ఎస్‌ఎస్‌బీ పట్టుకుంది. ఆమె విచారణలో ఉన్నందున ఆమెను పిథోర్‌గఢ్‌ జిల్లా జైలులో బందీగా ఉంచారు. ఆమె పరారైన నేపధ్యంలో జైలుతో పాటు మొత్తం పోలీసు శాఖలో కలకలం చెలరేగింది. దీంతో పోలీసు బృందాలు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పరారైన యువతి లింక్‌ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుంచి ఆమె పాండే గ్రామం మీదుగా పరారవుతూ కనిపించింది. 
ఇది కూడా  చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్‌లో అరుదైన గౌరవం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)