Breaking News

బలగాల ప్రయోగంపై కేపీ ఓలీకి సమన్లు! 

Published on Fri, 01/02/2026 - 05:49

కాఠ్మండు: గత ఏడాది సెప్టెంబర్‌లో నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో యువత పైకి సాయుధబలగాలను ప్రయోగించి నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కమిషన్‌ త్వరలో ఆయనను విచారించనుంది. జనవరి 21వ తేదీలోగా నివేదిక సమర్పింంచాల్సి ఉండటంతో ఆలోపు నిర్ణయాత్మకమైన నేతలు, అధికారుల నుంచి కమిషన్‌ సభ్యులు వివరణ తీసుకోనున్నారు. 

సెప్టెంబర్‌ 8వ తేదీన కాఠ్మండులో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేపట్టిన యువతపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లో అవినీతి, వారసత్వ రాజకీయాలు, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన జనం జెన్‌–జెడ్‌ యువతరం సారథ్యంలో ఉద్యమించడంతో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా ఆనాడు 77 మంది చనిపోయిన విషయం తెల్సిందే.

 దీంతో నేపాల్‌ తాత్కాలిక ప్రభుత్వం నియమించిన గౌరీ బహదూర్‌ కర్కీ సారథ్యంలోని విచారణ కమిషన్‌ దర్యాప్తు మొదలెట్టింది. కర్కీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఘటనలో స్పష్టత కోసం ఓలీకి సమన్లు జారీచేసి ప్రశ్నించే అవకాశముందని చెప్పారు. అయితే కమిషన్‌ ఎదుట తాను హాజరయ్యే ప్రసక్తే లేదని కేపీ శర్మ ఓలీ కరాఖండీగా చెప్పేశారు. కమిషన్‌ చట్టబద్ధతను, విచారణలో పారదర్శకతను ఆయన ప్రశ్నించారు.

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)