Breaking News

నేపాల్‌ కొత్త కరెన్సీ నోట్లలో భారత్‌ ప్రాంతాలు? మరోమారు ఉద్రిక్తతలు?

Published on Wed, 09/04/2024 - 07:58

ఖాట్మండు: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాతో జతకట్టి, భారత్‌తో శత్రుత్వాన్ని పెంచుకునే దిశగా తప్పటడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్, నేపాల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

చైనాపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్న ఓలీ.. ఆ దేశపు సూచనల మేరకు భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేపీ ఓలీ తన తప్పుడు నిర్ణయాలతో భారతదేశంతో సంబంధాలను చెడగొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు. నేపాల్ ప్రభుత్వం తాజాగా తమ దేశ మ్యాప్‌లో భారతదేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా చూపించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేపాల్ కొత్త నోట్లను  ఆయుధంగా వాడుకుంటోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ త్వరలో సవరించిన మ్యాప్‌తో కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ‘నేపాల్‌ ఖబర్‌ డాట్‌ కామ్‌’ తాజాగా నేపాల్ దేశ బ్యాంక్ జాయింట్ ప్రతినిధి డిల్లిరామ్ పోఖరేల్‌ తెలిపిన వివరాలను వెల్లడించింది. భారత్‌లో భాగమైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలతో కూడిన కొత్త మ్యాప్‌తో బ్యాంక్ నోట్ల ముద్రణను నేపాల్ దేశ బ్యాంక్ ఇప్పటికే ప్రారంభించిందని పేర్కొంది. ఏడాదిలోగా నోట్ల ముద్రణ పూర్తి కానున్నదని కూడా వెల్లడించింది.

కాగా, గతంలో అప్పటి నేపాల్‌ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని నేపాల్ క్యాబినెట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని, సవరించిన మ్యాప్‌తో కూడిన కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.  ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదేపని చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర తమ భూభాగాలు అని భారత్ స్పష్టం చేసినప్పటికీ, చైనా సూచనలతో నేపాల్‌ ఈ దుశ్చర్యకు పాల్పడుతోదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)