Breaking News

ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్‌లో ఎన్ని భాషలంటే..

Published on Mon, 06/26/2023 - 07:54

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేయాలన్నా.. ఇతరులు చెప్పేవి అర్థం చేసుకోవాలన్నా ‘భాష’ ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా.. అందులో 840 భాషలు పపువా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడ­య్యింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాష­లు వాడుకలో ఉన్న దేశంగా పపువా న్యూ గినియా రికార్డులకెక్కింది. 

ఆసి­యా, ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో 4,62,840 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 94 లక్షలే. కానీ ఇప్పటికీ అక్కడి ప్రజలు 840 భాషల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంగ్లిష్‌ అధికార భాష కాగా.. హిరిమోటు, పీఎన్‌జీ సింగ్, టోక్‌ పిసిన్‌ తదితర భాషలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక ఇండోనేసియా 710 భాషలతో రెండో స్థానంలో నిలిచింది. నైజీరియా 524 భాషలతో మూడో స్థానంలో, భారత్‌ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి. ఇక, 337 భాషలతో అమెరికా ఐదో స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా,  307 భాషలతో చైనా ఏడో స్థానంలో కొనసాగుతోంది. 

ఉత్తర కొరియా ప్రజలు.. కొరియన్‌ తప్ప ఇతర భాషలను ఉపయోగించరు.ఆ తర్వాత వాటికన్‌ సిటీలో రెండు, ఐస్‌ల్యాండ్‌లో రెండు, దక్షిణ కొరియాలో 5 భాషలే వాడకలో ఉన్నాయి. అలాగే అత్యధిక దేశాల్లో ఇంగ్లిష్‌ భాషను ఉపయో­గిస్తున్నట్లు వెల్లడైంది. 67 దేశాల్లో ఇంగ్లిష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో  స్పానిష్, 10 దేశాల్లో పోర్చుగీస్, ఆరు దేశాల్లో జర్మన్, నాలుగు దేశాల్లో రష్యన్‌ భాష వాడుకలో ఉంది. 

ఇది కూడా చదవండి: హలో.. ఆస్ట్రోనాట్‌..!

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)