Breaking News

నేపాల్‌లో ఎన్నికల సందడి.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Published on Wed, 01/21/2026 - 05:12

నేపాల్ రాజకీయాలలో ఒక కొత్త శకానికి నాంది పలికేందుకు రంగం సిద్దమైంది. ఆ దేశ సార్వత్రిక ఎన్నికలు మార్చి 5న జరగనున్నాయి. అయితే ఈ సాధారణ ఎన్నికల కోసం మంగళవారం(జనవరి 20)తో  నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

ప్రత్యక్ష ఎన్నికల విధానం (FPTP) కింద ఉన్న 165 సీట్ల కోసం 3,500 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో సుమారు 400 మంది మహిళా అభ్యర్థులు ఉండడం గమనార్హం. కాగా నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 సీట్లు ఉంటాయి. ఇందులో 165 సీట్లకు ప్రత్యక్షంగా, మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 

గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్, రబీ లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. గత సెప్టెంబర్‌లో జెన్‌ జెడ్‌ యువత నిరసనల తర్వాత నేపాల్ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. 

దీంతో నేపాలీ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈసారి పెద్ద సంఖ్యలో కొత్తవారికి అవకాశమిచ్చాయి. నేపాలీ కాంగ్రెస్ తన 165 స్థానాల్లో 106 స్థానాలను కొత్తవారికే కేటాయించింది. మాజీ ప్రధానులు కె.పి. శర్మ ఓలీ, పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', మాధవ్ కుమార్ వంటి వారు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఖట్మండు మాజీ మేయర్ బాలేంద్ర షాపై అందరి కళ్లు ఉన్నాయి.

కె.పి. శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఝాపా-5 నియోజకవర్గం నుండి బాలేంద్ర షా పోటీచేయనున్నాడు. నేపాల్‌లో అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందరూ అతడిని ముద్దుగా 'బాలెన్ షా' పిలుచుకుంటారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలెన్ షా  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖట్మండు మహానగరానికి మేయర్‌గా ఎన్నికై సంచలనం సృష్టించాడు. ఇప్పుడు తన పదవికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికలలో బరిలోకి దిగాడు. కాగా ఈ ఎన్నికలలో సుమారు 1.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)