Breaking News

అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను

Published on Tue, 01/09/2024 - 05:33

కేప్‌ కనావరెల్‌(యూఎస్‌): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్‌ మిషన్‌ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్‌ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్‌ ల్యాండర్‌ను యూనైటెడ్‌ లాంఛ్‌ అలయన్స్‌ వల్కన్‌ రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్‌ కనావరెల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు.

పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్‌ తయారీలో ఆస్ట్రోబోటిక్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలను ఆహా్వనించినట్లయింది.  చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్‌ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి.

ఆస్ట్రోబోటిక్‌తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్‌ మెషీన్స్‌తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్‌ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్‌లతో అమెరికా, సోవియట్‌ యూనియన్‌లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్‌ చేరాయి. గతేడాది రష్యా, జపాన్‌ ల్యాండర్లు విఫలమయ్యాయి.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)