Breaking News

తీవ్ర గాయాలతో భారత్‌లోకి మయన్మార్‌ సైనికులు.. ఏమైందంటే?

Published on Sun, 12/31/2023 - 12:14

మయన్మార్‌ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్‌లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్‌ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్‌ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్‌ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్‌ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్‌ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోని మిజోరంలోకి ప్రవేశించారు.

కాగా.. కొన్ని రోజులుగా భారత్‌ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్‌ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్‌ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్‌లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్‌ అధికారులు  గాయపడిన మయన్మార్‌ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం మయన్మార్‌ సైనికులు అస్సాం రైఫిల్స్‌ కస్టడీలో మయన్మార్‌ సరిహద్దు వద్ద ఉ‍న్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్‌ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్‌ అధికారులు తెలిపారు. 

మరోవైపు మయన్మార్‌లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్‌హుడ్‌ అలయన్స్‌ (టీబీఏ), మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్‌ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి.  

చదవండి: హౌతీ రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు