Breaking News

ట్రంప్‌ పాలనలో మస్క్‌కు కీలక పాత్ర..!

Published on Sat, 11/09/2024 - 11:24

వాషింగ్టన్‌:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయంలో బిలియనీర్‌, టెస్లా అధినేత ఇలాన్‌ మస్క్‌ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ ప్రచారానికి ఆర్థికంగా అండదండలందించడమే కాకుండా ట్రంప్‌ తరపున మస్క్ నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ పాలనా వ్యవహారాల్లో మస్క్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మరింత బలపర్చేలా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడుతుండగా వారిద్దరి సంభాషణలో మస్క్‌ కూడా చేరినట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు  వెలువడుతున్న సమయంలో మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్‌ నివాసంలోనే ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా కూడా మారాయి. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్‌ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో ట్రంప్‌ ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.

జెలెన్‌స్కీతో మాట్లాడాల్సిందిగా మస్క్‌ను ట్రంప్‌ కోరినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో మస్క్‌  కొద్దిసేపు మాట్లాడారని కథనాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ అధ్యక్ష పేషీలో మస్క్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట.. అధ్యక్షుడిగా ఎన్నికైనందునే 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)