Breaking News

‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్‌

Published on Sat, 06/07/2025 - 17:05

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ ఒకరు రాజకీయ వేత్త. మరొకరు వ్యాపార వేత్త. నిన్నమొన్నటి వరకు వాళ్లిద్దరూ ఆప్తమిత్రులు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులు. ట్రంప్‌  ఏ ముహూర్తాన  బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెచ్చారో నాటి నుంచి  వాళ్లిద్దరి మధ్య సఖ్యత దెబ్బ తింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఆ పిచ్చోడితో నేను మాట్లాడేంది అని ట్రంప్‌ అంటుంటే..  జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు కూడా ఉందంటూ మస్క్‌ బాంబు పేల్చారు. సంబంధిత ఆధారాల్ని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. ఈ క్రమంలో ట్రంప్‌తో మస్క్‌ రాజీకి సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది.  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అంటున్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ వెనక్కి తగ్గారా? ట్రంప్‌తో రాజీకి రెడీ అయ్యారా?. అంటే అవుననే అనిపిస్తున్నాయి మస్క్‌ చర్యలు.

జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరుందంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసిన ఫైల్స్‌ను మస్క్‌ డిలీట్‌ చేశారు. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్‌లో తన పేరు ఉండడం వల్లే ఆ డాక్యుమెంట్‌ను ట్రంప్‌ బహిర్ఘతం చేయడం లేదంటూ మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్‌ కొద్ది సేపటిక్రితం ఆ పోస్టును డిలీట్‌ చేశారు. దీంతో మస్క్‌ వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది.

టెస్లాలో భారీ నష్టాలు, స్పేస్‌ ఎక్స్‌లో ప్రాజెక్ట్‌లపై ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో ట్రంప్‌తో విభేదాల విషయంలో మస్క్‌ ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు నేను లేకపోతే డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో దఫా అమెరికాకు అధ్యక్షుడు అయ్యే వారు కాదు. కొత్త పార్టీ పెడతానంటూ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ స్పందించారు.

 మస్క్‌ చేసిన వ్యాఖ్యల్ని ఏబీసీ మీడియా ప్రతినిధులు ట్రంప్‌ వద్ద ప్రస్తావించారు. మీపై మస్క్‌ ఆరోపణలు గుప్పిస్తున్నారు కదా. మీరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదా? అన్న ప్రశ్నకు ట్రంప్‌ స్పందించారు. మీరు మాట్లాడేది ఆ పిచ్చోడి గురించేనా. ప్రత్యేకంగానే కాదు. అసలు మాట్లాడేందుకే నేనే ఇష్టపడడం లేదు. ఒకవేళ మస్క్‌ నాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా..  అందుకు నేను సుముఖంగా లేనన్నారు.  

ఈ క్రమంలో మస్క్‌- ట్రంప్‌ వార్‌ ఎటుకి దారి తీస్తుందోనని రాజకీయ వేత్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇన్వెస్టర్లు మాత్రం ట్రంప్,మస్క్‌లు మళ్లీ ఏం కొంపముంచుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)