Breaking News

పాటలు పాడే రోడ్డు.. కారు నడిపితే రోడ్డుపై నుంచి మ్యూజిక్

Published on Tue, 02/10/2026 - 23:06

రోడ్డు అంటే మనకు గుర్తొచ్చేది ట్రాఫిక్, హారన్‌లు, స్పీడ్ బ్రేకర్లు. కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల రహదారులే సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. వీటినే 'మ్యూజికల్ రోడ్స్' అంటారు. ప్రత్యేకంగా రూపొందించిన రంబుల్ స్ట్రిప్స్.. అంటే రోడ్డుపై పొడవైన కమ్మీలు లేదా గీతలు.. కారు వాటిపై నుంచి దూసుకెళ్తే వైబ్రేషన్ ద్వారా సంగీతాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ సృజనాత్మక ఆలోచనతో అదే స్ట్రిప్స్‌ను ప్రత్యేక దూరం, పొడవుతో అమర్చితే, కారు వెళ్లే వేగాన్ని బట్టి అవే ఒక మెలోడియస్ ట్యూన్‌గా మారిపోతాయి.

ఇలా పాడే రహదారుల్లో అమెరికా ముందుంది. కాలిఫోర్నియాలోని లాంకాస్టర్ నగరంలో 'సివిక్ మ్యూజికల్ రోడ్' పేరుతో ఒక ప్రత్యేక రహదారి ఉంది. హైవే 14 సమీపంలోని అవెన్యూ జీలో, 30వ , 40వ వీధుల మధ్య ఉన్న పావు మైలు పొడవైన ఈ సెక్షన్‌పై గంటకు 50 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే ప్రసిద్ధమైన 'విలియం టెల్ ఓవర్చర్' స్వరాలు వినిపిస్తాయి. రోడ్డుపై కారు వెళుతుంది  కానీ వినిపించేది ఆర్కెస్ట్రా మ్యూజిక్!

అసలు ఈ ప్రాజెక్ట్ 2008లో మొదట అవెన్యూ జీలో, నివాస ప్రాంతాలకు దూరంగా తిరిగి నిర్మించారు. హోండా సివిక్ బ్రాండ్ స్పాన్సర్ చేయడంతో దీనికి 'సివిక్ మ్యూజికల్ రోడ్' అనే పేరు వచ్చింది. స్వరంలో చిన్నచిన్న విరామాలు ఉన్నా ఆ అనుభూతి మాత్రం మరిచిపోలేనిది. ఇలా రోడ్డు నుంచి పాట వినేందుకు చాలా మంది డ్రైవర్లు ఒక్కసారే కాదు మళ్లీ మళ్లీ అదే రోడ్డుపై డ్రైవ్ చేస్తారు!

ఇదే తరహాలో న్యూ మెక్సికోలో కూడా మరో మ్యూజికల్ రోడ్ ఉంది. చారిత్రాత్మక యూఎస్ రూట్ 66 సమీపంలోని టిజెరాస్ పట్టణం వద్ద, ఎన్ఎమ్ 333 రహదారిపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ భాగంలో గంటకు 45 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే 'అమెరికా ది బ్యూటిఫుల్' స్వరాలు వినిపిస్తాయి. ఆ మెలోడి అంత స్పష్టంగా, అంత ప్రేరణాత్మకంగా ఉంటుంది కాబట్టి ప్రయాణం ఒక సంగీత యాత్రగా మారిపోతుంది.

ఇలాంటి సంగీత రహదారులు జపాన్, దక్షిణ కొరియా, డెన్మార్క్, హంగేరీ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. కొన్ని జాతీయ గీతాలు ప్లే చేస్తాయి. కొన్ని క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తాయి. నిజానికి వీటిని డ్రైవింగ్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు, డ్రైవర్లకు  ప్రయాణాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా  మార్చడం వీటి లక్ష్యం. ఒక చిన్న ఇంజినీరింగ్ ఐడియా.. ఒక సాధారణ రోడ్డును మ్యూజిక్ స్టేజ్‌గా మార్చింది. ఇకపై రోడ్డుపై డ్రైవ్ చేస్తూ బోర్ కొట్టేస్తే ఎక్కడో ఒకచోట రహదారే మీ కోసం పాట పాడుతుందేమో!

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు