Breaking News

America: ‘ఇస్కాన్’లో బుల్లెట్‌ పేలుళ్లు.. తక్షణ చర్యలకు భారత్‌ డిమాండ్‌

Published on Wed, 07/02/2025 - 10:11

శాన్ ఫ్రాన్సిస్కో: హోలీ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన  అమెరికాలోని స్పానిష్ ఫోర్క్‌లో గల ఇస్కాన్  రాధా కృష్ణ ఆలయ ప్రాంగణంలో తాజాగా బుల్లెట్‌ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఆలయానికి భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఇస్కాన్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రివేళ ఆలయంలో భక్తులు, అతిథులు ఉన్న సమయంలో ఆలయ భవనం చుట్టుపక్కల 20 నుండి 30 బుల్లెట్‌ కాల్పులు జరిగాయి.

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని ఖండిస్తూ, ఇస్కాన్‌కు సంఘీభావం తెలిపింది. అలాగే నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాన్సులేట్ తన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో స్పానిష్ ఫోర్క్, ఉటాలోని ఇస్కాన్ రాధా కృష్ణ ఆలయంలో  జరిగిన కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులపై సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నామని పేర్కొంది.
 

ఈ  ఏడాది మార్చి 9న కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్‌)) హిందూ ఆలయంపై ఖలిస్తానీ గ్రూపు దాడి చేసింది. నాటి వివరాలను బీఏపీఎస్‌ తన అధికారిక పేజీలో వివరించింది. గత  ఏడాది సెప్టెంబర్ 25 రాత్రి కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని స్వామి నారాయణ మందిరంపై కూడా విధ్వంసక శక్తులు దాడిచేశాయి. ఇటువంటి ఘటనలు స్థానిక హిందువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్‌పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్‌

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)