Breaking News

పాకిస్తాన్‌కు పాకిన మంకీపాక్స్‌.. ముగ్గురికి పాజిటివ్‌

Published on Fri, 08/16/2024 - 12:29

ఇస్లామాబాద్‌: మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు  ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్‌ ఉన్నట్లు తేలింది. వారికి మంకీపాక్స్‌ ఉన్నట్లు ఆగస్ట్ 13న పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది.

కాగా  ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు.  అప్పట్లో దేశంలో మొత్తం 11 మంకీపాక్స్‌ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు