Breaking News

ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్‌ ఏమిటి?

Published on Tue, 10/03/2023 - 07:01

ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఏ ప్రాంతంలో ఉన్నారనే టాపిక్‌ ప్రస్తావనకు వచ్చినప్పుడు పాకిస్తాన్‌లోని ఒక ప్రదేశం చర్చకు వస్తుంది. అందుకే ఆ ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

ఈ ప్రాంతంలోని మహిళలు 80 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఎంతో అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తారు. అందుకే ఇక్కడి అమ్మాయిలను అత్యంత అందగత్తెలుగా భావిస్తారు. దీనికితోడు మంచి ఆరోగ్యం కారణంగా ఇక్కడి మహిళలు 60 ఏళ్లు దాటిన తరువాత కూడా తల్లులయ్యే సామర్థ్యాన్ని కలిగివుంటున్నారు. 

ఈ ప్రదేశం మరెక్కడో కాదు మన పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో ఉంది. దీని పేరు హుంజా వ్యాలీ. ఇక్కడి స్త్రీలు ఎంతో అందగత్తెలుగా పేరొందారు. వారి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కారణంగా ఇక్కడి మహిళలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారు. 

ఇక్కడ ప్రజలు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతుంటారు. దీనికి కారణం ఇక్కడ ప్రవహించే నదిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు ఉన్నాయి.  ఈ కారణంగానే ఇక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు.

హుంజా వ్యాలీ ప్రజలు మధ్యాహ్నం ఒకసారి, రాత్రిపూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. దీనికితోడు ఇక్కడ ప్రజలు ఇక్కడివారినే వివాహం చేసుకుంటారు. ఇ‍క్కడి ‍ప్రజలు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసి, దానినే తింటారు. 

ప్రపంచంలోని ఆయుర్దాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలను బ్లూ జోన్‌లు అంటారు. హుంజా వ్యాలీ కూడా బ్లూ జోన్‌ పరిధిలోకే వస్తుంది. ఇక్కడి ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు.
ఇది కూడా చదవండి: సింగపూర్‌ ట్రిప్‌కు ఐఆర్‌సీటీసీ బడ్జెట్‌ ప్యాకేజీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)