Breaking News

మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి..

Published on Sat, 08/19/2023 - 09:02

అమెరికాలోని మిసిసిపీలో ఒక సంచలన ఉదంతం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలుడిని పోలీసులు జైలుకు తరలించారు. తన తల్లి కారు వెనుక మూత్ర విసర్జన చేయడమే ఆ చిన్నారి చేసిన తప్పిదం. దీనిపై ఆ చిన్నారి తల్లి న్యాయం పోరాటం చేసేందుకు సన్నద్దురాలైంది. పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని, దీంతో తన పిల్లాడు బెంబేలెత్తిపోయాడని ఆమె ఆరోపించింది. 

‘జనాలు ఉండే చోట కారు వెనుక ఎందుకు మూత్ర విసర్జన చేశావని’ ఆ బాలుడిని మీడియా ప్రశ్నించగా తన తల్లి, సోదరి ఆ సమయంలో.. ‘దగ్గరలో ఎటువంటి బాత్రూమ్‌లు లేవు.. నువ్వు కారు వెనక మూత్ర విసర్జన కానిచ్చేయమని’ తెలిపారన్నాడు. అయితే ఆ సమయంలో దీనిని చూసిన ఒక అధికారి ఆ పిల్లాడిని మందలించి, విడిచిపెట్టబోతున్నంతలో పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ పిల్లాడిని అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. 

ఈ సందర్భంగా ఆ ప్లిలాడి తల్లి ఇజోన్‌ మాట్లాడుతూ తన కుమారుడు పార్కింగ్‌ ప్లేస్‌లో మూత్ర విసర్జన చేయడం సరైనది కాదంటూనే, ఇంత చిన్న విషయానికే పోలీసులు పిల్లాడిని లాక్కుపోవడం దారుణమన్నారు. పదేళ్ల పిల్లాడిని పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించింది. తన కుమారుడు పోలీసులను చూసి భయపడిపోయాడని, వారు జైలుకు తరలిస్తుంటే పెద్దపెట్టున రోదించాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కొద్దిసేపటి తరువాత పోలీసులు ఆ బాలుడిని తల్లితో పాటు పంపించేశారు. 

సెంటోబియా పోలీస్ చీఫ్ రిచర్డ్ చాండ్లర్  మాట్లాడుతూ యూఎస్‌ యూత్ కోర్ట్ చట్టంలోని వివరాలు తెలిపారు. ఏడేళ్లలోపు పిల్లల విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమన్నారు.  10 ఏళ్ల పిల్లలు చట్టవిరుద్ధంగా ఏదైనా చేస్తే, చట్టాన్ని అమలు చేసేవారు దానిని ప్రభుత్వానికి నివేదించవచ్చని వివరించారు. ఇటువంటి కేసుల నుంచి పిల్లలను మినహాయించడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చాండ్లర్‌ తెలిపారు. 
ఇది కూడా చదవండి: తల్లి చేతులు అణిచింది.. అన్న కాళ్లు నొక్కి పెట్టాడు.. తండ్రి చేతుల్లో పాశవిక పరువు హత్య!

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)