Breaking News

అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి

Published on Tue, 01/30/2024 - 10:37

అమెరికాలో భారతీయుల విద్యార్ధుల మరణాలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్‌ సైనీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు సైనీ తలపై 50 సార్లు సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్ధి అమెరికాలో ప్రాణాలు విడిచాడు.  ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం అధికారులు తెలిపారు.

జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్‌లో మాస్టర్స్‌చేస్తున్న ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. క్యాంపస్‌లోని మారిస్‌ జే జుకక్రో లాబొరేటరీస్‌ సమీపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం వద్దనున్న ఐడీ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు.

పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతోంది. 

తల్లి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే..
తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్‌స్టాగగ్రామ్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కొడుకు జనవరి 28 నుంచి కనిపించడం లేదని, అతను యూఎస్‌లోని పర్డ్యూ యూనివర్సిటీలో చదవుతున్నట్లు తెలిపారు. తమ కుమారుడికి సంబంధించిన సమాచారం  తెలిస్తే చెప్పాలని  వేడుకున్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు. తాము పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనంతరం నీల్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)