సంబురాల్లో తుపాకుల మోత.. రక్తమోడిన గువానాజువాటో సిటీ

Published on Thu, 06/26/2025 - 07:20

మెక్సికోలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మతపరమైన సంబురాల్లో కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబబ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్యకాలంలో అత్యంత హింసాత్మక ప్రాంతంగా ముద్రపడిన గువానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటోలో ఇది చోటుచేసుకుంది. 

బుధవారం.. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్‌కు గౌరవంగా నిర్వహించిన వీధి ఉత్సవంలో స్థానికులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. అప్పటిదాకా మద్యం, చిందుల్లో మునిగిపోయిన ప్రజలు.. భయంకరమైన కాల్పులతో ఒక్కసారిగా బయపడి పరుగులు తీశారు. ఆ సమయంలో చిన్నారులు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇరాపువాటో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 మంది అక్కడికక్కడే మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రకటించారు. దాడి వెనుక ఉద్దేశం.. దుండగుల వివరాలు తెలియరావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. క్రిమినల్‌ గ్రూపుల మధ్య తగాదాలతో గువానాజువాటో.. మెక్సికో క్రైమ్‌ ఏరియాగా పేరు ముద్రపడిపోయింది. గత నెలలో కూడా ఈ స్టేట్‌లో ఓ చర్చి కార్యక్రమంలో ఏడుగురు హత్య గురయ్యారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో 1,435 హత్యలు నమోదయ్యాయి, ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండింతల సంఖ్య కావడం గమనార్హం. 

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)