Breaking News

జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు

Published on Sat, 04/12/2025 - 09:22

మెటా అధినేత మార్క​ జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌ విజిల్‌బ్లోయర్‌(వేగు) సారా విన్‌ విలియమ్స్‌ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్‌ జోష్‌ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్‌ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు.  

సీబీఎస్‌ కథనం ప్రకారం సారా విన్‌ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.  చైనాతో మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్‌ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. 

మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్‌ సెన్సార్‌షిప్‌ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్‌ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్‌.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్‌ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?.  ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. 

సారా విన్‌ విలియమ్స్‌ గతంలో ఫేస్‌బుక్‌లో గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్‌లెస్‌ పీపుల్‌ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. 

అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్‌బుక్‌ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్‌ జోష్‌ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్‌ విలియమ్స్‌ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)