Breaking News

ట్విట్టర్‌కు పోటీగా మెటా ‘థ్రెడ్స్‌’

Published on Wed, 07/05/2023 - 05:13

లండన్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్‌్కకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌కు మరో సవాల్‌ ఎదురవనుంది. ట్విట్టర్‌ను ఢీకొట్టేందుకు మెటా తాజాగా థ్రెడ్స్‌ అనే యాప్‌ను సిద్ధం చేసింది. యాపిల్‌కు చెందిన యాప్‌ స్టోర్‌లోఇది కనిపిస్తోంది. ట్విట్టర్‌లో మాదిరిగానే దీనిలోనూ టెక్ట్స్‌ రూపంలో మెసేజీలను లైక్‌ చేయవచ్చు. షేర్, కామెంట్‌ కూడా చేయవచ్చని యాప్‌ స్టోర్‌ లిస్టింగ్‌లోని స్క్రీన్‌షాట్‌ను బట్టి తెలుస్తోంది.

ఒకట్రెండు రోజుల్లోనే ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ఇది ఇన్‌స్టాగ్రామ్‌కు లింకై ఉన్న ‘టెక్ట్స్‌ బేస్డ్‌ కన్వర్జేషన్‌ యాప్‌’. ‘నేటి నుంచి రేపటి ట్రెండింగ్‌లో ఉండే అన్ని అంశాల వరకు చర్చించుకునే సమూహాల కోసమే థ్రెడ్స్‌’ అని మెటా తెలిపింది. ఇన్‌స్ట్రాగామ్‌ యూజర్లు అదే అకౌంట్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని చెబుతున్నారు. దీనిపై మెటా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక చేపట్టిన పలు మార్పులపై యూజర్లు అసంతృప్తితో ఉన్న సమయంలో మెటా ‘థ్రెడ్స్‌’ను తేనుండటం గమనార్హం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)