ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి

Published on Tue, 09/19/2023 - 08:36

లీమా: దక్షిణ అమెరికా దేశం పెరూలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెరూలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన కారణంగా ప్రమాదం జరిగింది. 

వివరాల ప్రకారం.. ఆండెస్‌ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్నలో లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో దాదాపు 24 మంది మృతి చెందగా మరో 35 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. 

ఇదిలా ఉండగా.. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనాటి ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పెరూలో సరైన రోడ్డు సదుపాయాలు లేక ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. ఇక్కడ రాత్రిపూట, పర్వతాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్‌ మృతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)