Breaking News

రెసిడెన్షియల్‌ భవనంలో భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి

Published on Mon, 04/17/2023 - 13:13

ఓ నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా సుమారు 16 మంది మృతి చెందారు. దుబాయ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. దుబాయ్‌లోనిన దీరా బుర్జ్‌ మురార్‌ ప్రాంతంలో రెసిడెన్షియల్‌ భవనంలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనం నాల్గో అంతస్థులో మొదలైన మంటలు క్షణాల్లో ఇతర అపార్ట్‌మెంట్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో కేరళ, తమిళనాడుకి చెందిన వారు ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ప్రతినిధి  అల్‌ రాస్‌లో శనివారం మధ్యాహ్నాం 12.35 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు.

అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని తరలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. దాదాపు 10 మంది పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనలో బాధితులను గుర్తించడంలో సహకరించిన కేరళకు చెందిన సామాజిక కార్యకర్త నసీర్‌ వాటనపల్లి మాట్లాడుతూ..

భవనంలో కేరళకు చెందిన ఇద్దరు దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు పురుషులు, పాకిస్తాన్‌ కజిన్స్‌, నైజీరియన్‌ మహిళతో సహా 16 మంది మృతి చెందినట్లు తెలిపారు. కాగా, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాలను భారత్‌కు పంపేందుకు సహకరిస్తామని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
(చదవండి: ఆశాకిరణం ఆఫ్రికా! నైజర్‌ మహిళ జీవితకాలంలో ఏడుగురు పిల్లలకు జన్మ)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)