Breaking News

విషాదం: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published on Sun, 03/19/2023 - 17:10

ఢాకా: మన పక్కదేశమైన బంగ్లాదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల ప్రకారం..  ఎమద్‌ పరిబహన్ సంస్థకు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా అదుపుతప్పి నీళ్లు లేని ఓ కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు వెళ్తున్న బస్సు మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతిచెందారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్‌ చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఘటనపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)